పిఠాపురం : మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించడం పట్ల పిఠాపురం నియోజకవర్గం బీజేపీ కన్వినిర్ డా. బుర్ర వెంకట కృష్ణం రాజు ఆదేశాల మేరకు పిఠాపురం పట్టణంలో విజయోత్సవాలను చేసుకున్నారు. స్థానిక బంగారమ్మ రావి చెట్టు సెంటర్ వద్ద బీజేపీ నాయకులు దంగేటి దొరయ్య, అల్లుబోయిన సూరిబాబు, కర్నీడి తాతయ్య, ఏలూరి సూర్యనారాయణ, ఎడ్ల ప్రభాకర్ రావు, కంబాల నాగేశ్వర్రావు, కాండవిల్లి మారేష్, పెనుపోతుల సత్తిరాజు, రేలంగి సుధాకర్, తోటకూర బురయ్య, గేదెల బాబ్జి, కలవలపిల్లి సత్తిబాబు, అడబాల శ్రీను మరియు ఇతర కార్యకర్తలు విజయోత్సవ వేడుకలు సందర్భంగా స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ విజయోత్సవ కార్యక్రమంలో పిఠాపురం జనసేన ఇంచార్జి మర్రెడ్డి శ్రీనివాస్, మురాలశెట్టి సునీల్, చెల్లుబోయిన సతీష్, తదితరులు పాల్గొన్నారు.