contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

NEC లొ ఘనంగా 76వ NCC ఆవిర్భావ వేడుకలు

నరసరావుపేట : భారత సాయుధ దళల యువ విభాగ సైన్యం అయిన నేవి, ఆర్మీ మరియు వాయుసేన తో కూడిన ట్రై సర్వీసెస్ ఆర్గనైజషన్ గ స్వచ్ఛంద ప్రతిపాధికన పాఠశాల మరియు కళాశాల విద్యార్థులకు చిన్న ఆయుధాలు మరియు డ్రిల్ తో ప్రాధమిక సైనిక శిక్షణా అందిస్తూ సమాజం పట్ల వారికున్న బాధ్యతను నెరవేర్చే విధంగా విద్యార్థిని, విద్యార్థులకు ఒక క్రమశిక్షణకరమైన జీవితాన్ని అలవరచెందుకు నేషనల్ కాడేట్ కార్ప్స్ (NCC) ఎంతగానో తొడపడుతుంది అని గుంటూరు గ్రూప్ కమాండర్ కల్నల్ S.M.చంద్రశేఖర్  పేర్కొన్నారు. స్థానిక నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాల NCC విభాగం ఆధ్వర్యంలో 76వ NCC ఆవిర్భావ దినోత్సవన్నీ పురస్కరించుకుని వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యం అతిధులుగా గుంటూరు గ్రూప్ కమాండర్ కల్నల్ S. M. చంద్రశేఖర్ మరియు 23వ ఆంధ్ర బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నాల్ సునీల్ గౌతమ్ గారు హాజరయ్యారు.ముందుగా NCC కాడేట్స్ చే గౌరవ వందనం స్వీకరించి కళాశాల చైర్మన్ శ్రీ మిట్టపల్లి వెంకట కోటేశ్వరరావు గారు మరియు ప్రిన్సిపాల్ డా. ఎస్. వెంకటేశ్వర్లు గారి సమక్షంలో కళాశాల NCC విభాగం చేపట్టే కార్యక్రమాల గురించి కళాశాల NCC అధికారి మేడికొండ రాజేష్ బాబు వివరించారు.

3లక్షల వ్యయంతో నిర్మించిన Obstacle Cource: అనంతరం FSFS పధకం లొ భాగంగా సుమారు 3లక్షల వ్యయంతో కళాశాల యాజమాన్యం సహకారంతో నిర్మించిన Obstacle Course ని కళాశాల యాజమాన్యం సమక్షంలో ముఖ్య అతిధుల చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసి కాడేట్స్ కు అంకితం చేసేరు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు: NCC కాడేట్స్ Ceremonial Drill, Rotational Drill, క్లాసికల్ మరియు Folk Dance, సీనియర్ కాడేట్ కావేరి బృందం చేసిన కోలాటం చూపారులను మంత్రం ముగ్దల్ని చేసింది.

C-Certificates ప్రధానం : మార్చ్-2024 లొ నిర్వహించిన సి-సర్టిఫికెట్ ఫలితాలలో ఉత్తిరనులైన కాడేట్స్ కు Guntur Group కమాండర్ కల్నాల్ చంద్రశేఖర్ మరియు కల్నాల్ సునీల్ గౌతమ్, చైర్మన్ శ్రీ మిట్టపల్లి వెంకట కోటేశ్వరరావు, ప్రిన్సిపాల్ డా. ఎస్. వెంకటేశ్వర్లు మరియు NCC అధికారి మేడికొండ రాజేష్ బాబు మరియు వివిధ విభాగాధిపతుల ఆధ్వర్యంలో సి-సర్టిఫికెట్స్ ప్రధానం చేసేరు.

Rifles ప్రధానం చేసిన మాజీ కాడేట్స్:*కళాశాల NCC నుండీ 2024 లొ సి సర్టిఫికెట్ పూర్తిచేసుకున్న కాడేట్స్ అందరూ కలిసి సుమారు 15000ల రూపాయలు విలువచేసే చెక్క రిఫల్స్ ను కళాశాల యాజమాన్యం కు అందించారు.

బహుమతుల ప్రధానం: అనంతరం 76వ NCC day సందర్భంగా ఏర్పాటుచేసిన Games లొ గెలుపొందిన కాడేట్స్ కు ముఖ్యం అతిధులు మరియు కళాశాల యాజమాన్యం చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేయటం జరిగింది.

అనంతరం 76వ NCC ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కటింగ్ చేసి.. కాడేట్స్ కు అభినందనలు తెలిపారు.

కార్యక్రమంలో కళాశాల కళాశాల వైస్ చైర్మన్ శ్రీ మిట్టపల్లి చక్రవర్తి , సెక్రటరి శ్రీ మిట్టపల్లి రమేష్ బాబు , వైస్ ప్రిన్సిపాల్ డా. డి. సునీల్ , వివిధ విభాగాల అదీపతులు మరియు కాడేట్స్ పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :