పిఠాపురం : పిఠాపురం పట్టణ పురపాలక సంఘంలో మంగళవారం మున్సిపల్ చైర్మన్ గండేపల్లి సూర్యవతి బాబీ అధ్యక్షతన కౌన్సిల్ బడ్జెట్ సమావేశం జరిగింది. కౌన్సిల్ సమావేశంలో వాడి వేడిగా పన్నులపై కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ కనకారావుని సమస్యలపై నిలదీశారు. బడ్జెట్ సమావేశంలో పన్నులు లిస్ట్ లో ఉందని, పిఠాపురం ఇప్పుడు టాక్స్ రూపంలో పనులు వసూలు చేస్తున్న పిఠాపురం మున్సిపాలిటీ 70% వరకు పనులు చేస్తామని ఫిబ్రవరి 85% వసూలు చేస్తామని కమిషనర్ కనకారావు చెప్పారు. పన్నుల విషయంలో పదో వార్డ్ కౌన్సిలర్ అల్లవరపు నగేష్ బడ్జెట్ సమావేశంపై మాట్లాడుతూ పన్ను కట్టకపోతే కుళాయి కనెక్షన్ తొలగించండి, ఇంటి కరెంటు పవర్ కట్ చేయండి అని చెప్తున్నారు కానీ వార్డులోని శానిటేషన్ బాగోలేదు, వాటర్ రావట్లేదు అయినా పన్నులు ఎలా చెల్లిస్తారు అని కమిషనర్ ని నిలదీశారు. ముందు అన్ని కరెక్ట్ గా ఉన్నప్పుడే పన్నులు వసూలు చేయాలన్నారు. కోళ్ల బంగారు బాబు మాట్లాడుతూ పన్నులు డబల్ ఎంట్రీ వస్తుందని, అది ఎందుకు వస్తుందని కమిషనర్ ని అడగడంతో అది తాను వెరిఫికేషన్ చేశానని ఇక నుంచి అలా జరగకుండా చూసుకుంటానని అన్నారు. 18వ వార్డు కౌన్సిలర్ పంపనబోయిన అన్నపూర్ణ వార్డులోని అద్వానంగా వున్న రోడ్లు, డ్రైన్లు బాగోలేదు, వాటర్ రావట్లేదు అని ఒక పేపర్లో కథనం రావడంతో స్పందించలేదు అన్నారు. ఏడవ వార్డు కౌన్సిలర్ బోను దేవా మాట్లాడుతూ పిఠాపురంలోని 30 వార్డులోని చాలా అధ్వానంగా ఉన్నాయి అన్నారు గత సంవత్సరం పాదగయ క్షేత్రంలో ఇందిరానగర్ నుంచి 20 మంది వర్కర్లు వెళ్లారని, పనిచేసినందుకు డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదని..? కమిషనర్ ని ప్రశ్నించారు. 15 వార్డు కౌన్సిలర్ రాయుడు శ్రీనుబాబు మాట్లాడుతూ 15 వార్డు మోహన్ నగర్ లో డ్రైన్లు అన్ని చెత్త పేరుకుపోయి ఎక్కడ వాటర్ అక్కడ ఉంటుందన్నారు. శానిటేషన్ సెక్రటరీ గాని, సిబ్బంది గానీ పట్టించుకుంటలేదన్నారు. పిఠాపురం పట్టణంలోని 30 వార్డులోని దోమలు విపరీతంగా ఉన్నాయని, దానికి ఫాగింగ్ చేయించాలని కమిషనర్ను కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
