contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

దొమ్మజబ్బు నివారణ హెచ్ ఎస్ టీకాలపై అవగాహన .. ఉచిత పశు ఆరోగ్య శిభిరం..

నెల్లూరు జిల్లా, మర్రిపాడు మండల పరిధిలోని ఖాదర్ పూర్ గ్రామంలో పశు సంవర్ధక శాఖ అధికారి ఎ డి గురుజయంతి ఆధ్వర్యంలో ఉచిత పశు ఆరోగ్య శిభిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిభిరంలో పాడి రైతులకు దొమ్మజబ్బు నివారణ హెచ్ ఎస్ టీకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గేదె దూడలకు పెరుగు మందు మరియు వ్యాక్సిన్ వేయుట పశువులలో రోగాల నివారణకు తగు చర్యలపై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా గురుజయంతి మాట్లాడుతూ నట్టల నివారణ, ఎలికపాముల నివారణ మందులు, కడుపులో జలగల వంటి నివారణకు మందులు తీసుకువచ్చి అవసరమైన రైతులకు అందజేయడం జరిగిందని అదేవిదంగా సూటి గేదెలకు పోషకపరమైన మందులను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని ఈ చక్కటి అవకాశాన్ని ప్రతి ఒక పాడి రైతులు సద్వినియోగం చేసుకొవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డి ఎల్ ఓ నరసింహులు, ఏ హెచ్ రహమద్ భాషా,పశు సంవర్ధక సహాయకులు ముజీమిల్, మోహన్ కృష్ణ, రవి మరియు పాడి రైతులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :