కరీంనగర్ జిల్లా:లయన్ ఎలుక రవీంద్ర ప్రసాద్ అడ్వకేట్ జోన్ చైర్ పర్సన్ బెజ్జంకి జన్మదిన సందర్భంగా గురువారం గన్నేరువరం లయన్స్ క్లబ్ నుండి ఉచిత కంటి ఆపరేషన్ చేసుకుని తిరిగి వచ్చిన పేషంట్ కు బ్రెడ్ ప్యాకెట్స్ పంచి స్కూల్ విద్యార్థులకు 150 విద్యార్థుల కు నోట్ బుక్స్ సీట్స్ అందించి పిల్లలకు ప్లాస్టిక్ నిషేధం పై అవేర్నెస్ లయన్ సభ్యులు రవీంద్ర ప్రసాద్ సతీమణి లయన్ బాబాయ్ మాత వివరించడం జరిగింది. అనంతరం లయన్ సభ్యులు ముఖ్య అతిథి జోన్ చైర్ పర్సన్ లయన్ రవీంద్ర ప్రసాద్ కి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జోన్ చైర్ పర్సన్ రవీంద్ర ప్రసాద్, బెజ్జంకి లయన్స్ క్లబ్ సెక్రెటరీ బాబాయ్ మాత మరియు డిస్టిక్ క్యాబినెట్ లయన్ బూర శ్రీనివాస్,ఎంజె ఎఫ్, డిస్టిక్ క్యాబినెట్ బొడ్డు సునీల్, క్లబ్ సెక్రటరీ జీల ఎల్లయ్య, కోశాధికారి తేల్ల భాస్కర్,లయన్ బొడ్డు బాలయ్య, ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపాల్ మరియు టీచర్స్, మల్లేష్ గౌడ్, దొంగల ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
