కరీంనగర్ జిల్లా: సోమవారం జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి హైస్కూల్ ను ఆదివారం కరీంనగర్ సీపీ మహంతి సందర్శించారు.ఈసందర్భంగా సీపీ మహంతి మాట్లాడుతూ వెన్నంపల్లి పోలింగ్ స్టేషన్ క్రిటికల్ ఉన్నందున సందర్శించినట్లు తెలియజేశారు.అలాగే అధికారులు,పోలీస్ సిబ్బంది ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా నిర్లక్ష్యం వహించరాదని, అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.సిబ్బందికి పలు సూచనలు సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో హుజరాబాద్ రూరల్ సీఐ వెంకట్,సైదాపూర్ ఎస్సై జన్ను ఆరోగ్యం,పోలీస్ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.