కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో పెద్దమ్మ ఆలయంలో జరిగిన చోరీపై కరీంనగర్ క్లూస్ టీం రంగంలోకి దిగింది. ఈ సందర్భంగా తాళం తో పాటు ఆలయం తలుపులు, హుండీ, పరిసరాల్లో వస్తువుల పై క్లూస్ టీం, ఇన్స్పెక్టర్ ఏం శ్రీధర్, హెడ్ కానిస్టేబుల్ కనుకయ్య, ఆనవాళ్లు సేకరిస్తున్నారు. గన్నేరువరం ఏఎస్ఐ లక్ష్మీనారాయణ, పోలీస్ సిబ్బంది సతీష్ క్లూస్ టీం తో ఉన్నారు.
