- భర్త మృతి చెందడంతో కుప్పకూలి మృతి చెందిన భార్య
- గ్రామంలో శోకసముద్రంలో గ్రామస్తులు
- కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారంలో ఘటన
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం: ఏడు అడుగులు, మూడుముళ్ల బంధంతో ఒకటైన ఆ దంపతులు మరణం లోను ఒక వెంట ఒకరు నడిచారు. భర్త అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ వార్త విని తట్టుకోలేక భార్య కూడా కుప్పకూలి చనిపోయింది, ఈ హృదయ విదారక ఘటన కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం గ్రామానికి చెందిన ములుగు రాయమల్లు (75) చిలకమ్మా (70) దంపతులు వారికి ముగ్గురు కుమారులు రవి,శ్రీనివాస్, సతీష్ ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు సమయంలో భర్త రాయమల్లు మృతి చెందాడు. భర్త మరణాన్ని జీర్ణించుకోక భార్య అదే రోజు రాత్రి 11 గంటలకు ఒక్కసారిగా కుప్పకూలిపోయి మృతి చెందింది. వీరికి మంగళవారం అంత్యక్రియలు జరిగాయని కుమారులు రవి తెలిపారు.