జగిత్యాల జిల్లా,మెట్ పల్లి: కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని 420 రోజులలో ఒక్క హామీ కూడా సరిగ్గా అమలు చేయడం లేదని అసమర్థ ప్రభుత్వం కళ్ళు తెరిపించాలని కోరుతూ జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో కోరుట్ల నియోజకవర్గ బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ క్యాంప్ కార్యాలయం నుంచి పాదయాత్రగా వచ్చున ఆయన బి.ఆర్.ఎస్ నాయకులతో కలిసి గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా కోరుట్ల నియోజకవర్గ బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 420 హామీలు ఇచ్చారని అధికారంలో వచ్చి 420 రోజులు అవుతుందని ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకపొగ ప్రజలను కష్టాలకు గురి చేస్తుందని మండిపడ్డారు. ఎంతో కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాదించుకుంటే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని బ్రష్టు పట్టిస్తుందని విమర్శించారు. ఆనాడు దేశ స్వాతంత్ర్య కోసం కాంగ్రెస్ పార్టీని పెడితే నేడు ప్రజలను కష్టాలకు గురి చేస్తుందని, మహాత్మా గాంధీ అయిన వారికి మంచి బుద్దిని ప్రసాదించాలని కోరుతూ వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు. ఉదయం లేవగానే ముఖ్యమంత్రి తో సహా మంత్రులు కూడా రైతు భరోసా పై అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 420 రోజులుగా అబద్ధాలు చెబుతూ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఎన్ని ఇబ్బందులు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 11 సార్లు 75 వేల కోట్ల రైతు బంధు డబ్బులు వేశారని గుర్తు చేశారు.