- బండి సంజయ్ పై అనుచిత వ్యాఖ్యలను సహించం
- మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేశ్ హెచ్చరిక
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం
కరీంనగర్ జిల్లా: కేంద్ర హోమ్ సహాయమంత్రి బండి సంజయ్ పై ముఖ్యమంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలను గన్నేరువరం మండల బీజేపీ అధ్యక్షుడు తిప్పర్తి నికేశ్ తీవ్రంగా ఖండించారు. బుధవారం బీజేపీ నేతలతో కలిసి మండల కేంద్రంలో ఆయన రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
దివంగత గద్దర్ తన జీవితమంతా ప్రజలను రెచ్చగొట్టే పాటలను పాడారు అని అన్నారు.. మంది పిల్లలను రెచ్చగొట్టి అడవి బాట పట్టించిన ఆయన తనపిల్లలను మాత్రం అమెరికాలో చదివించారని నికేశ్ మండిపడ్డారు. దేశం కోసం ధర్మం కోసం నిరంతరం పనిచేసిన బీజేపీ కార్యకర్తలను హతమార్చిన గద్దర్ కు పద్మశ్రీ ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు బండి సంజయ్ బొమ్మను దగ్ధం చేయడాన్ని నికేశ్ తీవ్రంగా ఖండించారు. బీజేపీ నాయకుల జోలికోతే ఖబర్దర్ అని ఆయన హెచ్చరించారు. బండి సంజయ్ పేరు వింటేనే కాంగ్రెస్ నేతలు ఉలిక్కిపడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే బండి సంజయ్ తో అభివృద్ధిలో పోటీ పడాలని, అభివృద్ధికి నిధులు తీసుకురావాలని సవాల్ విసిరారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు తమను విమర్శించండం మానుకొని అభివృద్ధిపై దృష్టి సారించాలని తిప్పర్తి నికేశ్ సూచించారు.
ఈకార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు మాజీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ విలాసాగర్ రామచంద్రం, ఆటికం రామచంద్రం, కాంతలా శ్రీనివాసరెడ్డి, బండి తిరుపతి, బీజేవైఎం జిల్లా స్వచ్ఛభారత్ కన్వీనర్ కూన మహేష్, నరసింహ, స్వామి, బొమ్మాడి సురేందర్రెడ్డి, అనుమండ్ల సతీష్, కుర్ర హరీష్,వినేయ్, కరుణాకర్, బోయిని హరీష్, శివ, అజేయ్, హరీష్, మహేందర్,సతీష్, కూన ప్రశాంత్, నవీన్, రాకేష్, అబిలాష్, సంతోష్, బిజెపి సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.