- రిగ్ బ్లాస్టింగ్ వల్ల తీవ్ర నష్టం
- బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పాంగి మత్స్య కొండ బాబు
అల్లూరి జిల్లా, హుకుంపేట : హుకుంపేట మండల కేంద్రానికి అనుకుని వున్నా కొట్నాపల్లి క్వారీ పై సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవటం లో ఎందుకు విఫలం అవుతున్నారని బీజేవైఎం అరకు పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాంగి మత్స్య కొండ బాబు ప్రశ్నించారు, గత కొన్ని నెలలు గా కొట్నా పల్లి క్వారీ వల్ల ఇబ్బందులు ఎదురుకుంటున్నా ప్రజలు ఆందోళన లు చేస్తూ, స్పందన లో సైతం పిర్యాదు చేస్తున్నారని అయినా అధికారుల్లో కనీసం చలనం లేకపోవటం ఆశ్చర్యకరం అన్నారు, అనుమతులకు మించి రిగ్గింగ్ బ్లాస్ట్ చెయ్యటంతో సమీపంలోనీ గిరిజన ప్రజల అవాసాలు దెబ్బతినటమే కాకా అనారోగ్యల బారిన పడుతున్నామని, క్వారీ డస్ట్ వలన పంటలు కూడ సక్రమంగా పండే పరిస్థితి లేదని స్థానిక ప్రజలు తమ దృష్టికి తీసుకు వచ్చారాని అయన తెలిపారు, స్పందన లో పిర్యాదు చేసిన కూడ ఫలితం లేకపోవటం తో గిరిజన ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని అన్నారు, మోతాదుకి మించి మందుగుండు రిగ్గింగి బ్లాస్టింగ్ చెయ్యటం మూలాన గర్భిణీ స్త్రీలు, ఈ లోకం చూడని పశు గుడ్డు కూడ వాయు కాలుష్యం, నీటి కాలుష్యం వల్ల అనారోగ్యం బారిన పడి గ్రహణం మొర్రి, ఊపిరి తిత్తుల సమస్య వంటి వ్యాధులతో జన్మించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు,త్వరలో బాధిత గిరిజన గ్రామాలను మా రాష్ట్ర, జిల్లా నాయకులతో సందర్శించి అధికారుల అలసత్వం పై జాతీయ ఎస్టి కమిషన్, మానవ హక్కుల కమిషన్ కు పిర్యాదు చేస్తామని స్పష్టం చేసారు, ఇకనైనా ప్రజల కోసమే పని చెయ్యటానికి వచ్చిన అధికారులు ప్రజల పక్షాన నిలిచి కొట్నా పల్లి క్వారీ పై తగు చర్యలు తీసుకుని గిరిజన ప్రజలకు క్వారీ సమస్య నుంచి విముక్తి చెయ్యాలని డిమాండ్ చేసారు.