పల్నాడు జిల్లా కారంపూడి మండలం లోని పేటసన్నిగండ్ల గ్రామ పరిధిలో ఈరోజు మధ్యాహ్నం సుమారు నాలుగు గంటల సమయంలో గ్రామానికి చెందిన ఇద్దరు పిల్లలు తప్పిపోయిన సంఘటన చోటుచేసుకుంది. ఇద్దరి పిల్లలు అంగన్వాడీ బడికి వెళ్లి ఇంటికి తిరిగి ప్రయాణంలో ఇంటి పరిధిలోని వాడుకలోలేని కారులో లోపలికి వెళ్లి డోర్ చేసుకొని ఆడుకుంటు నిద్రపోయారు. .అంగన్వాడి బడికి వెళ్లి తమ పిల్లలు ఇంకా ఇంటికి .రాలేదని పిల్లల తల్లిదండ్రులు గ్రామం అంతా వెతుకులాట ప్రారంభించారు. ఈ సమాచారం అందుకున్న కారంపూడి పోలీసు శాఖ డివిజన్ పరిధిలో గల గురజాల డిఎస్పి జయరాంప్రసాద్ ఆధ్వర్యంలో కారంపూడి రూరక్ సీఐ తమ సిబ్బందితో సంఘటన స్థలాన్ని పరిశీలించి. డిఎస్పీ ఆదేశాల మేరకు బృందాలుగా ఏర్పాటు చేసి వెతుకులాట ప్రారంభించారు. గ్రామం మొత్తం జల్లెడ పట్టడమే గాక సమీప పొలాలు కాలువలు అన్ని గాలించారు. చివరికి తమ ఇంటి పరిధిలో గల వాడుకలోలేని కారులో లోపలికి వెళ్లి నిద్రపోయారు. . సాయంత్రం గ్రామం వీధి మొత్తం గాలిస్తూ తిరుగుతూ పిల్లల ఉండే ఇంటి సమీపంలో గల కారు ని పరిశీలించగా పిల్లలు లోపల నిద్రపోతున్న సంఘటన చూసి వారిని బయటకు తీసి తల్లిదండ్రులు అప్పగించారు. పిల్లలు క్షేమంగా ఉన్నారు అనే విషయం తెలియాగానే గ్రామస్థులు. పోలీస్ శాఖ వారు ఊపిరిపీల్చుకున్నారు పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలకు కోసం వెతుకులాట ప్రారంభించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు అనంతరం డిఎస్పి జయరాం ప్రసాద్ కారంపూడి రురల్ సీఐ ని . సిబ్బందిని అభినందించారు..
