- బర్దిపూర్ లో విషాదాంతం..
- భూతగాదాలతోనే హత్య తలనరికి ఊరేగింపు చేసిన యువకుడు
- ఫేస్ బుక్ లో అప్లోడ్
- జహీరాబాద్ నియోజకవర్గంలో సంచలనం
సంగారెడ్డి: భూ వివాదాలతో పెద్దనాన్నను తల ముండెం వేరుచేసి ఊరేగింపు చేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో సంచలనంగా మారింది. స్థానిక సీఐ నోముల వెంకటేశం తెలిపిన వివరాల ప్రకారం ఝరాసంగం మండలంలోని బర్దిపూర్ గ్రామానికి చెందిన బండమీది చంద్రయ్య(60)కు తమ్ముడి కుమారుడు రాకేష్ అనే యువకుడు పాత కక్షలు, భూ తగాదాలను దృష్టిలో పెట్టుకొని వరుసకు పెదనాన్న అయినా చంద్రన్నను హత్య చేసి తల మొండెం వేరు చేసినట్లు తెలిపారు. అక్కడి నుంచి జహీరాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయాడు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెంకటేశం తెలిపారు. తలను మూడు కిలోమీటర్ల మీద తీసుకెళ్లి ఝరాసంగం పెట్రోల్ పంపు వద్ద పక్కన వేయడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే తలను తీసుకొని బర్దిపూర్ గ్రామంలో తిరగడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు.