contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఉద్యోగం కోసం చూస్తున్నారా.. ఈ దేశంలో లక్షల్లో జీతం !

Luxembourg : కొన్ని నెలల క్రితం.. ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాలలో ఒకటైన లక్సెంబర్గ్‌లో కార్మికుల కొరత గురించి వార్తలు వచ్చాయి. ఇక్కడ నైపుణ్యం కలిగిన నిపుణుల కొరత ఎక్కువగా ఉందని తెలుస్తోంది. దీని కోసం లక్సెంబర్గ్ ప్రభుత్వం చట్టం కూడా చేసింది. అయితే ఖాళీగా ఉన్న పోస్టులకు ఈ ప్రాధాన్యతను తొలగించారు. ఇక్కడ క్వాలిఫైడ్ వ్యక్తి జీతం దాదాపు రూ.2 కోట్లు ఉంటుంది. కొత్త చట్టం వల్ల ఇక్కడ ఉద్యోగం పొందడం మరింత సులువైంది. కొత్త చట్టం ప్రకారం.. ఎవరైతే లక్సెంబర్గ్ కు ఉద్యోగానికి వెళ్తారో వారితో పాటు వారిపై ఆధారపడి ఉన్నవారు కూడా వెళ్లొచ్చు. వారు ఏదైనా ఉద్యోగం లేదా వ్యాపారం కోసం ప్రత్యేక వీసా పొందాల్సిన అవసరం లేదు.కొత్త చట్టం ప్రకారం ఇక్కడికి వెళ్లి ఉద్యోగం చేయాలనే ఆలోచనలో ఉంటే ఐదు రోజుల్లో వీసా ఇస్తారు. ఇప్పుడు చదువు తర్వాత ఉద్యోగం వెతకడానికి వీసా వ్యవధిని 9 నుంచి 12 నెలలకు పెంచారు. ఐటీ కంపెనీలకు లక్సెంబర్గ్ కేంద్రంగా నిలవడం గమనార్హం. ఇక్కడ మీ సగటు జీతం సంవత్సరానికి 55 లక్షల నుండి 65 లక్షల వరకు ఉంటుంది. మీకు కొంత అనుభవం ఉంటే, మీ జీతం సంవత్సరానికి రూ. 2 కోట్ల వరకు ఉండే అవకాశముంది. మీరు లక్సెంబర్గిష్ భాష నేర్చుకుంటే అది మీకు చాలా సహాయకారిగా ఉంటుంది. కొత్త చట్టం 1 సెప్టెంబర్ 2023 నుండి అమలులోకి వచ్చింది. తలసరి స్థూల జాతీయోత్పత్తి పరంగా ఇది ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశం. పిల్లలను పెంచడానికి ఉత్తమమైన ప్రదేశాలలో ఇది కూడా ఒకటి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :