contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టండి: సిపిఎం

పార్వతిపురం మన్యం జిల్లా, కొమరాడ మండలం: పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల తాసిల్దార్ కార్యాలయం వద్ద సోమవారంకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై దేశ వ్యాప్త సమరభేరి జరిగే కార్యక్రమంలో భాగంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంల ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం సూర్యనారాయణ గారు మాట్లాడుతూ! ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ఆర్థిక విధానాలు రైతులను కార్మికులను, సామాన్య ప్రజలను వ్యవసాయ కార్మికులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేసేలా ఉన్నాయని, ఇలాంటి సందర్భంలో విద్యుత్ విద్యుత్ సంస్కరణల ప్రభావంతో విద్యుత్ చార్జీలు భారీగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు, రైతులకు ఎంతో మేలు చేసే వ్యవసాయ ఉచిత విద్యుత్ పథకాన్ని రద్దు చేసే కుట్ర కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే దానికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు పలకడం చాలా అన్యాయమని విమర్శించారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు గాని రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు గాని అధికారంలోకి వచ్చిన వెంటనే రోజు రోజుకు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని ధరలు అదుపు చేయాల్సిన ఈ రెండు ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోవడం విచారకరమని అన్నారు. మోడీ గత 9 సంవత్సరాలలో గ్యాస్ ధర 1200 రూ..లకు పెంచి కేవలం 200 రూపాయలు తగ్గించి రాబోయే సార్వత్రిక ఎన్నికలలో లబ్ధి పొందేలా ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు.. అలాగే సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట ఏమైందని అన్నారు, అలాగే ఇలాంటి సందర్భంలో ప్రభుత్వ సంస్థలైన ఎల్ఐసి;;; బిఎస్ఎన్ఎల్:: ఎయిర్పోర్టు ::బ్యాంకులు:: రైల్వే ;;విశాఖ స్టీల్ ప్లాంట్;; వంటి ప్రభుత్వ సంస్థలను బ డాపెట్టుబడుదారులకు కార్పొరేట్లకు అతి తక్కువ రేటుకు అమ్మే ఆలోచనలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉందని దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కట్టుబడి ఉండటం చాలా దురదృష్టకరమైన చర్యని ఇప్పటికైనా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు తమ విధానాలను మార్చుకొని కార్పొరేట్లకు సహాయపడే విధానాలను విడనాడాలని అలాగే విద్యుత్ చార్జీలు కూడా రోజురోజుకు పెంచే తరుణంలో సామాన్య ప్రజలు మధ్యతరగతి ప్రజలు వ్యవసాయ కూలీలు రైతులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉందని కావున విద్యుత్ చార్జీలు కూడా తగ్గించాలని లేని యెడల ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు . అలాగే సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో పాటు స్థానికంగా అనేక సమస్యలు ఉన్నాయని ముఖ్యంగా ఇటు ఆంధ్ర కి అటు ఒరిసా కి మధ్య ఆంధ్ర కి సంబంధించిన రెబ్బ వనధార అనే రెండు గ్రామాలు ఉన్నాయని ఈ గ్రామాలకు రహదారి సౌకర్యం పూర్తిగా లేదని ఒకవేళ కొమరాడ ఎమ్మార్వో కార్యాలయం కానీ బ్యాంకులకు గాని విద్యా వైద్యం కోసం నాగావళి దాటి రావలసిన పరిస్థితి ఉందని ఇలాంటి సందర్భంలో గడిచిన 20 రోజుల క్రితం ఒక పాపని కాపాడటం కోసం గ్రామస్తులు ఎదురు కర్రలతో తెప్పలు కట్టుకొని నదిలో ప్రాణాలు తెగించి పాప ప్రాణాలను కాపాడే పరిస్థితి ఉందని ఇంత జరుగుతున్నా కనీసం మన్యం జిల్లా ఐటీడీఏ అధికారులు ఆ గ్రామం వైపు చూడకపోవడం చాలా అన్యాయమని ఇలాంటి పరిస్థితుల్లో కనీసం నాగవల్లి నదిలో వేసుకోవడానికి మరబోటు ఇప్పించండి మహా ప్రభో అని గ్రీవెన్స్లో కలెక్టర్ దగ్గర చెప్పిన కనీసం 30 వేల రూపాయలు లేవని చెప్పడం చాలా అన్యాయమని ఇదేనా గిరిజలకిచ్చిన భరోసా ఇలాంటి సందర్భంలో రబ్బ వనధార గిరిజన ప్రజలు సంత డబ్బులు 30 వేలు రూపాయలు చందాలుగా ఎత్తుకొని ఒక బోటును సొంతంగా తయారు చేసుకునే పరిస్థితి ఉందని ఇలాంటి పరిస్థితుల్లో రెబ్బ వనధార గ్రామస్తులందరూ కూడా చాలా బాధతో ఆవేదంతో మాకు మా గ్రామాలకు మౌలిక వసతులతో పాటు మర బోటు అయినా ఇప్పించండి లేదా పూర్తిస్థాయిలో రహదారి సౌకర్యం కల్పించండి లేని యెడల మా రెండు గిరిజన గ్రామాలను ఒరిస్సా రాష్ట్రంలో కలిపే విధంగా అనుమతులు అయినా ఇవ్వండని కోరుతూ నాగవల్లి నదిలో ప్లే కార్డులు పట్టుకొని చాలా బాధతో ఆవేదంతో ఈరోజు తాసిల్దార్ కార్యాలయం వద్ద జరిగే నిరసన కార్యక్రమానికి గిరిజన ప్రజలు రావడం జరిగిందని కావున ఎంతగా ఇబ్బంది పడుతున్న వనధార రబ్బ గిరిజన గ్రామాలకు అన్ని విధాలుగా ఆదుకోవాలని వాళ్ళు చేసిన పోరాటానికి సిపిఎం పార్టీ పూర్తిగా మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ తరపున కోరుచున్నాము అవునా ఈ విషయాన్ని అయినా తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఐటీడీఏ అధికారులు జిల్లా కలెక్టర్ స్పందించి మర బోటును లేదా రహదారి సౌకర్యాన్ని వెంటనే కల్పించి అన్ని విధాలుగా ఆదుకోవాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నామన్నారు,అలాగే కొమరాడ మండలానికి సంబంధించి 31 పంచాయతీల్లో 9 పంచాయతీలకు సంబంధించి కొమరాడ మండలంలో 60 గిరిజన గ్రామాలకు ఎంతో ఉపయోగకరమైన పూర్ణపాడు లాబే సు వంతెన 14 సంవత్సరాలుగా పూర్తికాక అటు పాలకులు ఇటు అధికారులు ఎన్ని ధర్నాలు చేసిన ఎన్ని నిరసనలు చేసినా గ్రీవెన్స్ లో తెలియజేసిన కనీసం పట్టించుకోలేని పరిస్థితి ఉందని ఈ ప్పటికైనా పూర్ణపాడు లాభేసు వంతెన పనులు విషయంలో పాలకలు శ్వేత పత్రం విడుదల చేసి వంతెన కడతారా లేదా అనే విషయం ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఎందుకంటే ఇదిగో ఇప్పుడు కడతామని అదిగో అప్పుడు కడతాం అని పాలకలు ప్రజలకు మోసం చేయడం తప్ప కనీసం ఒక్క అడుగు కూడా ఈ వంతెన పని ముందుకెళ్లను పరిస్థితుల్లో ప్రజలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉందని కావాలా వెంటనే ఈ వంతెన పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే గడిచిన 6:30 సంవత్సరాలుగా ఏనుగుల వల్ల 11 మంది చనిపోగా పంట నష్టం ఆస్తి నష్టం సుమారు నాలుగు కోట్లు జరిగినా ఇంతవరకు పాలకుల నుండి ఎటువంటి స్పందన లేకపోవడం చాలా అన్యాయమని అలాగే ఈరోజు అనగా సోమవారం అర్థం గ్రామంలో అంతరాష్ట్ర రహదారి పైన ఒంటరి ఏనుగు వచ్చి బస్సులపై దాడి చేసి అటు ప్రయాణికులకు ఇటు వాహనదారులకు ఒక గంటపాటు భయభ్రాంతులు చేసే పరిస్థితి ఉందని కావున కావున ఇ ప్పటికైనా ఏనుగులు విషయములో పాలకులు సరైన నిర్ణయం తీసుకొని ఏనుగులు కూడా తరలిస్తారా లేదా అనే విషయాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా శ్వేత పత్రం వెంటనే విడుదల చేయవలసిన అవసరం ఎంత ఉందని డిమాండ్ చేస్తున్నాం ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం నాయకులు వెంకటేష్ జనార్ధన శివుని నాయుడు ప్రసాదు రాము లక్ష్మణ సంగమ్మ వివిధ గ్రామాలకు చెందిన గిరిజన ప్రజలు రైతులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :