- జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం
- జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్శు
మెదక్ జిల్లా: సావిత్రిబాయి పూలే జయంతి, జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో సామాజిక సంస్కర్త, ఆధునిక భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి ఫూలే 193వ జయంతి వేడుకలను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, ఇతర జిల్లా అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ మహిళల అభ్యున్నతి కోసం కృషి చేయాలని, అప్పుడే ఆమె ఆశయ సాధనకు కృషి చేసినట్లు అవుతుందని అన్నారు. సావిత్రిబాయి సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఇకనుండి ఆమె జయంతిని పురస్కరించుకుని ప్రతియేటా జనవరి 3 వ తేదీన మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించిందని తెలిపారు. అనేక ఆంక్షలతో కూడిన నాటి సమాజంలోనూ తన భర్త జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతో సావిత్రిబాయి చదువు నేర్చుకుని ఉపాధ్యాయురాలు అయ్యారని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకృష్ణ, జెడ్పి సీఈఓ ఎల్లయ్య, డిపిఓ యాదయ్య, ముఖ్య ప్రణాళిక అధికారి బద్రీనాథ్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, యువజన క్రీడల నిర్వహణ అధికారి నాగరాజు, సంబంధిత ఇతర జిల్లా అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు