కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా: బెజ్జూర్ మండలంలోని పాపన్నపేట గ్రామానికి ఉదయం 7:30 గంటలకు రావలసిన ఆర్టీసీ బస్సు రాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నామని . ప్రతినిత్యం పాపన్నపేట గ్రామం నుండి బెజ్జూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు, పెంచికల్పేట్, చెడ్వాయి, తదితర గ్రామాల నుండి విద్యార్థులు ఈ ఆర్టీసీ బస్సులో విద్యార్థులు వచ్చేవారిని ఉదయం సమయంలో ఆర్టీసీ బస్సు రాకపోవడంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు తెలుపుతున్నారు.
ప్రతినిత్యం రాత్రి సమయంలో వచ్చిన బస్సులు తెల్లవారుజామున వెళ్లిపోవడంతో మళ్లీ ఉదయం రావాల్సిన ఆర్టీసీ బస్సు రాకపోవడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి అధిక డబ్బులు చెల్లించి నష్టపోతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. ఆర్టీసీ బస్సు ఆగే ప్రాంతాలలో బస్సుల సమయ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. బస్సు రావడం లేదని డిపో మేనేజర్ కు ఫోన్ చేసినప్పటికీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని ప్రయాణికులు తెలుపుతున్నారు. ఇట్టి విషయమై ఆసిఫాబాద్ డిపో మేనేజర్ స్పందించి సమయపాలనతో ఆర్టీసీ బస్సులు నడిపేలా చూడాలని విద్యార్థులు, ప్రయాణికులు కోరుతున్నారు.