మాసాయిపేట తూప్రాన్: నిరుపేద కుటుంబం. రెక్కాడితేగానీ పూట గడవని పరిస్థితి. విధి వక్రీకరించి ప్రమాదవశాత్తు తల్లి చనిపోయింది. బిడ్డలకు దిక్కులేదు .. మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని మాసాయిపేట మండల కేంద్రంలో వెంగలి అనిత అనారోగ్యంతో ఆదివారం మరణించింది. నాలుగు సంవత్సరాల క్రితం ఇంటికి పెద్దదిక్కు బెంగాలీ కర్ణ అనారోగ్యంతో మరణించాడు. అప్పటినుండి మానసిక వికలాంగులైన ఇద్దరు ఆడ బిడ్డలను పోషించడానికి తల్లి రోజు కూలి నాలి పనిచేసి పోషించేది.
ఈ పరిస్థితిలో, ఇప్పుడు ఆమె మరణం తరువాత, ఆ ఇద్దరు చిన్నారుల పరిస్థితి దయనీయమైంది. తల్లి లేకుండా వారి జీవితాలు మరింత కష్టమైనవిగా మారాయి. చుట్టుపక్కల ప్రజలు ఈ విషయం తెలిసి సహాయహస్తం అందించే దాతలు ముందుకొచ్చి,
సంస్కారాల కోసం అవసరమైన చర్యలు చెప్పట్టారు. ఎవరైనా దాతలు సాయం చేయాలని స్థానిక రిపోర్టర్ టీవీ రిపోర్టర్ విజయకుమార్ కోరుతున్నాడు.