కరీంనగర్ జిల్లా: కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్స్, కార్మికుల మూడు నెలల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని ఈ రోజు సూపెరడెంట్ వీరరెడ్డీ కి (టియుసిసి) ప్రభుత్వ హాస్పటల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా యూనియన్ అధ్యక్షులు బండారి శేఖర్ మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పనిచేస్తున్న సానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్స్ మరియు ప్లంబర్ కార్మికులు దాదాపు 250 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి గత మూడు నెలలుగా జీతాలు రావడం లేదనీ అన్నారు. పెండింగ్లో ఉన్న జీతాలు ఇవ్వాలని అనేకసార్లు అధికారులకు, కాంట్రక్టర్ కు పిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదనీ విమర్శించారు. హైదరాబాద్ లోని డిఎంఈ కి కూడా పిర్యాదు చేసిన ఇప్పటి వరకు పెండింగ్ జీతాలు ఇవ్వలేదనీ అన్నారు. పెండింగ్ జీతాల కోసం తప్పనిసరి పరిస్థితులలో సమ్మె నోటీస్ ఇవ్వవలసి వచ్చిందని అన్నారు. పారిశ్రామిక వివాదాల చట్టం 1947 అండర్ సెక్షన్ 22(1) ప్రకారము తేది 24-02-202రోజు వరకు పిలిచి చర్చలు జరుపగలరని కోరుచున్నాము. చర్చలు జరిపి పెండింగ్ జీతాలు విడుదల చేయకుంటే తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెలోకి వెళ్తాం. దానికి పూర్తి బాధ్యత కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్ సూపెరడెంట్ మరియు ఏజిల్ సంస్థ యాజమాన్యం అని తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు పి.అరుణ్, కార్యదర్శి టి. కళావతి, నాయకులు రాజు, నరేష్ మరో 10 మంది కార్మికులు పాల్గొన్నారు.
