జగిత్యాల జిల్లా, మెట్ పల్లి: నూతన సిఐగా వి. అనిల్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ఎలాంటి సమస్యలు ఉన్న నేరుగా తనను సంప్రదించవచ్చని చెప్పారు. ప్రజలతో మమేకమై ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను కాపాడుతానన్నారు. చట్ట విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహించేవారి సమాచారం తనకు అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
