నిజామాబాద్ జిల్లా: ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో తన నివాసంలో ఉన్న ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన నిజామాబాద్ జిల్లా ఆదివాసి నాయకుడు గాండ్ల రామచందర్ ఆధ్వర్యంలో జిల్లా బాడీ కలవడం జరిగింది. ఆర్మూర్ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడు గాండ్ల రామచందర్ అదేవిధంగా కార్యవర్గ సభ్యులను సన్మానించారు వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు,
నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షుడు గాండ్లా రామచందర్ ఎమ్మెల్యే దృష్టికి ఆర్మూర్ నియోజకవర్గంలో ఉన్న ఆదివాసి నాయక పోడు కులస్తుల సమస్యలు వివరించగా ఆర్మూర్ ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి మున్సిపల్ పరిధిలో సంఘ భవనం గురించి 500 గజాల ప్లాటుతోపాటు సంఘ భవనం నిర్మించడం కోసం 25 లక్షల రూపాయల నిధులను మంజూరు చేశారు.
అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న నిరుపేద ఇల్లులేని ఆదివాసి నాయకపోడు కులస్తులకు ఇల్లు నిర్మించడం గురించి ప్రభుత్వం నుండి మూడు లక్షల రూపాయలు మంజూరు చేస్తానని తెలిపారు,
అదేవిధంగా మాక్లూర్ మండలం కల్లెడ గ్రామంలో కల్లేడ విద్యా కమిటీ చైర్మన్ సురంగల విజయ్ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటానని వారి పిల్లలు చదువుకోటానికి హాస్టల్లో చేర్పించి ఉన్నత చదువులు చదివిస్తానని వారికి ఉండటానికి ఒక ప్లాటు, ఇల్లు నిర్మించుకోవడానికి మూడు లక్షల రూపాయలు మంజూరు చేస్తానని తెలిపారు
ఇట్టి కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లూరు సాయన్న, జిల్లా కోశాధికారి శ్యానం పవన్, వర్కింగ్ ప్రెసిడెంట్ లొలం గంగాధర్, జిల్లా సాంస్కృతిక కార్యదర్శి పెర్కిట్ మూఢ అశోక్ ఆర్మూర్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ జి