contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

వాలీబాల్, కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభించిన డిఎస్పీ విశ్వప్రసాద్

రాజన్న సిరిసిల్ల జిల్లా: చదువుతో పాటు ఆటలు కూడా జీవితానికి ఎంతో అవసరం,విద్యార్థులు,యువత క్రీడల్లో రాణించాలి అని ఇల్లంతకుంట పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మండల స్థాయి వాలీబాల్, కబడ్డీ టోర్నమెంట్ సోమవారం సిరిసిల్ల డిఎస్పీ విశ్వప్రసాద్ ప్రారంభించారు.ఈ పోటీల్లో 16 కబడ్డీ టీమ్ లు,20 వాలీబాల్ టీమ్ లు 3 రోజుల పాటు పోటీల్లో పాల్గొననున్నాయి.. అనంతరం డిఎస్పీ గారు మాట్లాడుతూ..శారీరక ఆరోగ్యానికి క్రీడలు దోహదపడతాయని అన్నారు.ఆటల్లో గెలుపు, ఓటములు సహజమని , పోటీలో పాల్గొనడం ముఖ్యం అని తెలిపారు.గెలుపు ఓటముల కంటే జట్టు సహకారం ముఖ్యమని అన్నారు. క్రీడలు మనలో దాగి ఉన్న శక్తి సామర్థ్యాలను, పోరాట పటిమను వెలికి తీస్తాయన్నారు.మన అలవాట్లే మన జీవితాన్ని నిర్దేశిస్తాయని, యువత చెడు అలవాట్లకు వ్యసనాలకు దూరంగా ఉండాలి అని తెలిపారు. క్రీడలు , వ్యాయామం ఒత్తిడి,అలసట లోనవకుండా దోహదపడతాయన్నారు. కష్టపడితేనే క్రీడల్లోనైనా, ఏ వృత్తిలోనైనా ఫలితం ఉంటుందన్నారు.క్రీడలు మనలోని నాయకత్వ లక్షణాలను తట్టి లేపడంతో పాటు టీమ్ స్పిరిట్, ఐక్యమత్యాన్ని పెంచుతాయన్నారు. క్రీడల్లో పాల్గొనే వారు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారన్నారు. క్రీడలు మానసిక స్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల రూరల్ సి.ఐ ఉపేందర్, ఎస్.ఐ రాజేష్ సిబ్బంది ,క్రీడాకారులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :