కరీంనగర్ జిల్లా: మానకొండూరు నియోజవర్గ అభివృద్ధికి కోట్ల నిధులు కేటాయించిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విమర్శించే స్థాయి కవ్వంపల్లి దంపతులకు లేదని జెడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంప వెంకన్న అన్నారు. గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సభలకు పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకునే సంస్కృతి బిఆర్ఎస్ పార్టీకి లేదని అన్నారు, మానేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి ఎంపీ బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారని గతంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు, కవ్వంపల్లి అనురాధ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని నియోజకవర్గ మహిళలకు కవ్వంపల్లి దంపతులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు, తెలంగాణ బ్రాండ్ రసమయి బాలకిషన్ అని ఇది గుర్తుంచుకొని మాట్లాడాలని హెచ్చరించారు, కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జిల్లా మండల కోఆర్డినేటర్లు గూడేల్లి తిరుపతి, బద్దం తిరుపతిరెడ్డి, ఎంపిటిసిల ఫోరం మండల అధ్యక్షుడు గుడెల్లి ఆంజనేయులు, ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు బూర వెంకటేశ్వర్, బిఆర్ఎస్ నాయకులు న్యాత సుధాకర్, అట్టికం రవి,బిఆర్ఎస్ పార్టీ యువజన మానకొండూరు నియోజవర్గ అధ్యక్షుడు గూడూరి సురేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు మీసం ప్రభకర్,బుర్ర మల్లేశం గౌడ్, ఏలేటి చంద్రారెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
