హరితహారం లో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి: ఎంపీడీవో స్వాతి
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం లోని గునుకుల కొండాపూర్ గ్రామంలో ఎంపీడీవో స్వాతి ఉపాధి హామీ ఏపీవో శోభారాణి ఇరిగేషన్ జగదీష్ లతో కలిసి హరితహారంలో నాటిన మొక్కలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వేసవికాలం దృష్టిలో ఉంచుకొని ప్రతి మొక్కకు గ్రామపంచాయతీ ట్యాంకర్ ద్వారా నీటిని అందించాలని చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటించాలని పంచాయతీ కార్యదర్శి జయకర్ రెడ్డికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ హన్మాండ్ల యాదగిరి, మేట్లు లక్ష్మణ్, స్వప్న తదితరులు పాల్గొన్నారు.