నిజామాబాద్ ఎమ్మెల్సీ, భారత జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత జన్మదినాన్ని పురస్కరించుకొని భారత జాగృతి రాష్ట్ర నాయకులు సిద్ధంశెట్టి సాజన్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణం లోని 19వ వార్డులో భారత జాగృతి క్రికెట్ పోటీలు రెండు రోజులు నిర్వహించారు. చివరిరోజు క్రికెట్ పోటీల ముగింపు నేపద్యంలో కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. జాగృతి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసిన వేడుకలు నిర్వహించారు. క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందచేసిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య . ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏఎంసి చైర్మన్ నిరంజన్, మున్సిపల్ వైస్ చైర్మన్ సుదర్శన్, కౌన్సిలర్ సురేష్, ప్రజాప్రతినిధులు, భారత జాగృతి నాయకులు శ్రీనివాస్, మౌనిక్ , రాకేష్ , కలీం , శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు …
