జగిత్యాల జిల్లా కోరుట్ల : తహశీల్దార్ కార్యాలయంలో నేడు ఉదయం ఒక ఆసక్తికరమైన ఘటన జరిగింది. ఆఫీసు ఆవరణలో ఉన్న ట్రాక్టరును దొంగలు దొంగిలించారు. ఈ ట్రాక్టర్ గతంలో ఇసుక అక్రమరవాణా కోసం ఉపయోగించబడినట్లు సమాచారం.
సమాచారం ప్రకారం, రెవిన్యూ అధికారులు ఈ ట్రాక్టర్ మరియు మరో జేసీబీని సీజ్ చేసి రెవిన్యూ కార్యాలయంలో ఉంచారు. అయితే, ట్రాక్టర్ యజమాని కార్యాలయంలో ఎవరూ లేని సమయం చూసి అనుమతి లేకుండా ట్రాక్టర్ తీసుకెళ్లాడు.
ట్రాక్టర్ చోరీకి గురైందని తెలుసుకున్న అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారు. అయితే, విషయాన్నీతెలుసుకున్న ట్రాక్టర్ యజమాని రెవిన్యూ అధికారులకు లొంగిపోయి తానే ట్రాక్టర్ తీసుకెళ్లనని ప్రకటించాడు.
ఈ ఘటనపై స్పందించిన రెవిన్యూ అధికారులు యజమానికి జరిమానా విధించారు. అధికారులు చట్టానికి అతీతంగా జరుగుతున్న కార్యకలాపాలను అరికట్టడానికి కృషి చేస్తున్నారు.