- పాకాల మండలంలో పంట పొలాలను ధ్వంసం చేసిన ఏనుగుల మంద
- తీవ్రంగా నష్టపోయిన రైతులు…. భయాందోళనలో రైతులు, ప్రజలు
- వారం రోజుల్లో 10 ఎకరాల వరి మామిడి టెంకాయ చెట్లు ధ్వంసం చేసిన ఏనుగుల మంద
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పుదిపుట్లబైలు పంచాయతీ పుల్లావాండ్లపల్లి పరిసర ప్రాంతాలలో శనివారం రాత్రి ఏనుగులు మంద రైతుల పంట పొలాలను ధ్వంసం చేశాయి. చేతికొచ్చిన పంటలను ఏనుగులు ధ్వంసం చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. గత వారం రోజులుగా పాకాల మండలం లో ఏనుగులు పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయి.
ముఖ్యంగా రైతులు పండించిన వరి పంట 10 ఎకరాలు నష్టపోయినట్టు రైతులు చెబుతున్నారు. మామిడి, టెంకాయ చెట్లను పూర్తిగా ధ్వంసం చేస్తున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఫారెస్ట్ సిబ్బంది అధికారులు నష్టపోయిన పంటలను పరిశీలించి ప్రభుత్వం నుంచి రైతులకు నష్టపరిహారం కల్పించి ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. రైతులు , ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు స్పందించి తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.