పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి ముగ్గురాయి క్వారీ లో పడి 11 ఏళ్ళ బాలుడు షేక్ నజీర్ మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే నిన్న ఆదివారం స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి కాలు జారీ నీటిలో పడి మృతి చెందాడు. పోలీసువారికి సమాచారం ఇవ్వడం తో సహాయక చర్యలు చేపట్టి బాలుడి మృతదేహాన్ని బయటికి తీశారు. గతం లో ఇదే విధంగా పిల్లలు ఈత కొట్టడానికి వెళ్లి నీటిలో పడి మృతి చెందినట్టు స్థానికులు చెప్తున్నారు.
మైనింగ్ నిర్వహిస్తున్న యాజమాన్యం క్వారి చుట్టుపక్కల భద్రతా ఏర్పాట్లు కానీ , లేదా సెక్యూరిటీ సిబ్బందిని కానీ… పెట్టి .. ప్రజలు కానీ పిల్లలు కానీ క్వారీ వైపు వెళ్లకుండా ఏర్పాటు చేయలేక పోయారు. గ్రామీణ ప్రాంతాలకు దగ్గర్లో మైనింగ్ నిర్వహించడం వలన ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వ అధికారులు భద్రతా ఏర్పాట్ల పై ద్రుష్టి సారించాలి. కానీ ఇవేమి జరగలేదు . ఇకనైనా ప్రభుత్వ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవసిందిగా బాధిత కుటుంబం మరియు స్థానిక ప్రజలు కోరుతున్నారు.