contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఏకంగా సీఐనే బ్లాక్ మెయిల్ చేసిన నకిలీ విలేకర్ల ముఠా

నల్గొండ జిల్లాలో నకిలీ విలేకర్ల ముఠా ఒకటి పోలీసులను టార్గెట్ చేసింది. అక్రమాలు బయటపెడతామంటూ బెదిరింపులకు పాల్పడుతోంది. వీరి డిమాండ్లకు ఓ సీఐ తలొగ్గడం గమనార్హం. రూ.5 లక్షలు ఇవ్వాలని సదరు ముఠా డిమాండ్ చేయగా.. వారి ఆగడాలు తట్టుకోలేక సీఐ తన మిత్రుడి ద్వారా రూ 1.10 లక్షలు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఆ ముఠా బెదిరింపులు ఆగలేదు. తాము డిమాండ్ చేసిన సొమ్ములో మిగతా రూ.4 లక్షలు ఇవ్వాలంటూ వేధించడం ప్రారంభించింది.

ఈ ముఠా ఆగడాలు భరించలేక సదరు సీఐ తన శాఖలోని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు దర్యాఫ్తు చేపట్టి ఆ ముఠాలోని ఒక నకిలీ విలేకరిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :