చండీఘడ్ లో రెండురోజులపాటు నిర్వహించిన ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. సమావేశములో పలువురు జాతీయ నాయకులు మాట్లాడుతూ జర్నలిజానికి ఎదురవుతున్న సవాళ్లు, దాడులు, పోలీస్ కేసులు, చివరకు జర్నలిస్టులను హత్యలు చేయడం వరకు దారితీసిన పరిస్థితులపై వారు ఆందోళన వ్యక్తం చేశారు.ఇటువంటి సంఘటనలు జరగడానికి పాలకుల నిర్లక్షయమే ప్రధాన కారణమని వారు ఆరోపించారు. జోర్నలిస్టుల భద్రత కోసం ప్రత్యేకంగా మీడియా కమిషన్ ను ఏర్పాటు చేయాలనీ వారు డిమాండ్ చేశారు జర్నలిస్టులకు వేతనాలు లేకపోవడం, ఉన్న వేతనాలు కూడా అత్తెసరు వేతనాలు కావడం, వేతన చట్టం లేకపోవడం, పనిచేస్తున్న చోట ఉద్యోగ భద్రత లేకపోవడంపై పలువురు నాయకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర నివేదికను విరహత్ అలీ ప్రవేశపెట్టారు. ఈ నెల 23న సేవ్ మీడియా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని సమావేశంలో
తీర్మానం చేశారు.
నూతన జాతీయ కార్యవర్గం :
అధ్యక్షులుగా కే శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా ప్రభాకర్,బీరేందర్ సింగ్,అమార్ మోహన్కా ర్యదర్శులుగా వై నరేందర్, సోమసుందర్ సుభాష్,జైసింగ్ రావత్, కోశాధికారులుగా ప్రేమ్ భార్గవ్,జాతీయ కార్య వర్గ సభ్యులుగా ఆలపాటి సురేష్, నగునూరి శేఖర్, కే.సత్యనారాయణ,ఎం ప్రసాద్, నిరంజన్ బిస్వాల్, కే రమేష్ కుమార్ తదితరులు ఎన్నికయ్యారు.తెలంగాణ రాష్ట్రము నుంచి జాతీయ స్థాయి కార్యవర్గములో ఎన్నికయిన నాయకులకు రాష్ట్రం లోని వివిధ జిల్లాల ఐజేయూ నాయకులు అభినందనలు తెలిపారు