కడప జిల్లా దువ్వూరు మండలం భీమునిపాడు గ్రామంలో 14వ శతాబ్దపు శాసనాన్ని, విష్ణుమూర్తి విగ్రహన్ని గుర్తించినట్లు చరిత్రకారుడు, రచయిత బొమ్మిశెట్టి రమేష్ ఆదివారం మీడియాకు తెలిపారు..
విజయనగర సామ్రాజ్య రెండవ దేవ రాయలు(పాలన క్రీ.శ. 1377-1404) క్రీస్తు శకం 1394 ఏప్రిల్ 11వ తేదీ శనివారo ములికినాడులోని భీమునిపాడులో లక్కీ నాయిని కొడుకు కసవన వేయించినట్లు శాసనంలో లిఖించబడినదనీ రమేష్ చెప్పారు.
భీమునిపాడు గ్రామం శ్రీ కోదండరామ స్వామి ఆలయం దగ్గరగా శాసనం , ఆలయం ఎడమవైపు రెండు నుంచి మూడు అడుగుల విష్ణుమూర్తి విగ్రహన్ని గుర్తించినట్లు బొమ్మిశెట్టి వివరించారు.
ఏడు నుంచి ఎనిమిది అడుగుల హనుమంతుని విగ్రహ ప్రతిష్ట చేసినట్లు శాసనంలో పేర్కొనబడినదని ఆయన అన్నారు..
పురాతనమైన హనుమంతుని విగ్రహాo ఎండ తీవ్రతలకు విగ్రహo పగలటంతో గ్రామ పూజారులు ఉండకూడదని చెప్పటంతో గ్రామ పెద్దలు అన్నారం ఏట్లో పడేశారని భీమునిపాడు గ్రామస్తుడు, లాయర్ కుప్పన్న గారి సూర్యనారాయణ రెడ్డి తనకు చెప్పారని రమేష్ తెలిపారు..
నంద్యాల జిల్లా చాగలమర్రి కి చెందిన ఆవుల నరసింహ ప్రసాద్ తనకు ఈ శాసనం గురించి చెప్పగా శీలం అరవిందుతో కలసి శాసనాన్ని ,విష్ణుమూర్తి విగ్రహాన్ని సందర్శించినట్లు బొమ్మిశెట్టి రమేష్ చెప్పారు.
శాసనo , విష్ణుమూర్తి
ఛాయాచిత్రాలు మైసూర్ పురావస్తు శాఖ డైరెక్టర్ మునరత్నం రెడ్డికి పంపగా ఆయన నిశితంగా పరిశీలించి ఇది 14వ శతాబ్దపు నాటివని నిర్ధారణ చేశారని బొమ్మిశెట్టి రమేష్ వివరించారు.
కడప జిల్లా 3 వాల్యూమ్స్ శాసనాలలో ఈ శాసనం గురించి లేదని చరిత్రకారుడు , రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి తనకు చెప్పారని శాసనం చాలా అరుదైనదని గుర్తించినందుకు బొమ్మిశెట్టి రమేష్ కు అభినందనలు తెలిపారు…