contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

హైదరాబాద్ పాత బస్తీలో ఎన్‌ఐఏ సోదాలు

జాతీయ భద్రతా ఏజెన్సీ (ఎన్ఐఏ) ఈ రోజు దేశవ్యాప్తంగా పలు నగరాల్లో సోదాలు నిర్వహిస్తోంది. చెన్నై, కోయంబత్తూరుతో పాటు హైదరాబాద్ నగరంలోనూ సోదాలు నిర్వహిస్తోంది. ఈ రోజు ఉదయం పాతబస్తీ సహా నాలుగుచోట్ల ఎన్‌ఐఏ అధికారుల సోదాలు జరగడం చర్చనీయాంశమైంది. ఐఎస్‌ఐ సానుభూతిపరులుగా అనుమానిస్తున్న వారి నివాసాల్లో ఈ రైడ్స్ జరుగుతున్నాయి. వివిధ సంస్థలుగా ఏర్పడి ఐఎస్‌ఐఎస్ఐ మాడ్యుల్‌లో అనుమానితులు పనిచేస్తున్నట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. ఈ క్రమంలోనే తమిళనాడులోని చెన్నైలో పది ప్రాంతాల్లో, కోయంబత్తూరులో 20 చోట్ల సోదాలు జరుపుతున్నారు. హైదరాబాద్ లో జరిగిన దాడుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :