contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గణేష్ విగ్రహల మండపాలకు పోలీస్ శాఖ అనుమతి తప్పనిసరి : కారంపూడి ఎస్సై రామాంజనేయులు

పల్నాడు జిల్లా కారంపూడి :  వినాయకచవితి పండుగ సందర్బంగా కారంపూడి మండలంలోని గ్రామాలలో విగ్రహాలు ఏర్పాటు చేసేవారు పోలీస్ వారి అనుమతి పొందాలని కారంపూడి ఎస్ఐ ఎం. రామాంజనేయులు తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో అయన మీడియాతో మాట్లాడుతూ అనుమతులు లేకుండా విగ్రహాలు పెట్టకూడదని గ్రామాలలో విగ్రహ కమిటీ సభ్యులు అనుమతి పొందటానికి పోలీస్ స్టేషన్ కి వచ్చేతప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారి సర్టిఫికెట్ విగ్రహం పెట్టె ప్రదేశం ప్రభుత్వభూమి అయితే రెవిన్యూ శాఖ పర్మిషన్ లెటర్ విగ్రహం పెట్టె ప్రదేశం ప్రైవేటు స్థలం అయితే స్థలం యాజమాని పర్మిషన్ లెటర్ అఫిడవిట్ తీసుకొని రావాలని అయన కోరారు. అఫిడవిట్ లో ఉండవలసిన అంశాలు విగ్రహ మండపం వలన ప్రజలకు వాహనదారులకు ఇలాంటి ఇబ్బంది కలగజేయమని మండపం వద్ద ప్రతిరోజు ఇద్దరు వ్యక్తులు పగలు, రాత్రి కాపలా ఉండే విధంగా అలాగే మండపం దెగ్గర ఫైర్ ఫైటింగ్, మండపం దగ్గర సీసీ కెమెరాల ఏర్పాటు అలాగే మండపం దగ్గర పూజ కార్యక్రమలు జరిగేటప్పుడు ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చూసుకోవటం, మండపం దగ్గర వాహన పార్కింగ్ అలాగే మండపం వద్ద పెద్ద పెద్ద శబ్దాలు వచ్చే విధంగా ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా కాకుండా బాక్స్ టైపు సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవటం రాత్రి పది గంటల తరువాత ఉదయం ఆరు గంటలకు ముందు ఎలాంటి కార్యక్రమలు మండపం వద్ద నిర్వహించరాదు. నిమర్జన తేదీలు విగ్రహ ఏర్పాటు ప్రదేశాలు పోలీసు వారు సూచించిన విధంగా పాటించాలి. మండపం వద్ద మరియు నిమర్జనానికి వెళ్లే సమయంలో ఎటువంటి గొడవలు జరగకుండా చూసుకోవలసిన బాధ్యత కమిటీ సభ్యులదే. నిమర్జనానికి వెళ్ళేటప్పుడు డీజేలు, పాట కచేరి నిర్వహించకుండా సాధారణ బాక్స్ టైపు సౌండ్ ఏర్పాటు చేసుకునే విధంగా కమిటీ సభ్యులు చూసుకోవాలని, అలాగే నిమర్జనం సమయంలో ఎవరు కూడా నీటిలోకి దిగకుండా కమిటీ సభ్యులు జాగ్రత్తలు తీసుకొని పోలీస్ వారు నిర్ణయించిన ప్రదేశంలోనే విగ్రహం నిమర్జనం చేయాలి. అలాగే నిమర్జనం ప్రదేశాలలో క్రమపద్దతి పాటించి ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చూసుకోవలసిన బాధ్యత పైన తెలిపిన అన్ని సూచనలు సలహాలు కమిటీ సభ్యులు పాటించాలని అలా పాటించని వారి పై చట్టపరమైన చర్యలు వర్తిస్తాయని అఫిడవిట్ లో ఈ అంశాలను పొందుపరచి అనుమతి పత్రాలతో పోలీస్ స్టేషన్ కు వచ్చి అనుమతి పొందాలని ఎస్ఐ సూచించారు. నిబంధనలు ఉల్లంగిస్తే చర్యలు తప్పవని ఆయన అన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :