నరసరావుపేట: నరసరావుపేట డిపోకు మంజూరైన నూతన బస్సును నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలని ప్రయాణికులకు సూచించారు.
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం క్షేమకరంగా ఉంటుందని, ప్రజలు ఎల్లప్పుడూ సురక్షితమైన రవాణా సేవలను పొందాలని ఆయన తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు మెరుగైన రవాణా సేవలను అందించేందుకు కృషి చేస్తోందని ఆయన చెప్పారు.
ఈ సందర్భంగా చదలవాడ బస్సును నడిపి ప్రారంభించారు, దీనివల్ల ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు వీలు కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.