అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శింగనమల మండలం నాయనపల్లి క్రాస్ వద్ద లారీని కారు ఢీకొన్న ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. వేగంగా ప్రయాణిస్తున్న కారు లారీ కిందికి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు నుజ్జునుజ్జు అయింది.
మృతులు అనంతపురం ఇస్కాన్ ప్రార్థన మందిరం భక్తులుగా గుర్తించారు. వారు తాడిపత్రి నగర సంకీర్తన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా, ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
కాగా, అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగి ఆరుగురు మృతి చెందిన ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.