పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలో 80 సంవత్సరాల వృద్ధురాలిని నరికి చంపిన గుర్తు తెలియని దుండగుడు పట్టణంలోని పల్నాడు హాస్పిటల్ వెనుక నివాసం ఉంటున్న గుదె కస్తూరమ్మ ప్రార్దనకు వెళ్ళి వచ్చి ఇంటి వరండాలో నిద్రిస్తున్న సమయంలో తలపై బలంగా దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినది. కూతురి భర్త నల్లబోతుల బ్రహ్మమే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్న స్థానికులు.. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.










