పల్నాడు జిల్లా:పిడుగురాళ్ల పట్టణంలో RTC డిపో దగ్గర ఉల్లిపాయల లోడుతో వెళుతున్న లారీ డివైడర్ ను బలంగా ఢీకొనడంతో బోల్తా పడింది. డ్రైవరు, క్లీనర్ క్షేమం. రహదారి వెంట ప్రయాణిస్తున్న వారికి కూడా ఏమీ కాకపోవడంతో అక్కడ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే పోలీసు వారు సమాచారం తెలుసుకొని ట్రాఫిక్ అంతరాయం కలగాకుండా వాహనాలకు దారి మళ్లించారు. జరిగిన ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI పవన్ కుమార్ తెలిపారు.