తిరుపతి జిల్లా, చంద్రగిరి ప్రాజెక్ట్, పాకాల మండలం దామల్ చెఱువు సెక్టారు మొగరాల గ్రామ అంగన్వాడి కేంద్రం నందు “పౌష్ఠికాహార మాసోత్సవాలు సెప్టెంబర్ 1 వతేది నుంచి 30 వతేది వరకు జరిగే కార్యక్రములో భాగముగా గురువారం ఈసీసీఇ డే తో తల్లి దండ్రులను కుటుంబ సభ్యులను, గ్రామ పెద్దలు, న్కూల్ టీచర్స్, ఆశా వర్కర్స్ ను భాగస్వామ్యం చేసి ” పోషన్ భీ- పడ్డాయి భీ ” కార్యక్రమము ముఖ్య ఉద్దేశాల గురించి ఐసిడిఎస్ సూపర్ వైజర్ కృష్ణవేణి పిల్లల పోషణ తోపాటు వారి మానిసిక, శారీరక అభివృద్ధిని, మేధోవికాశానికి తొడ్పడే కార్యక్రమాలు గురించి. తల్లిదండ్రులకు, గర్భవతులకు చిన్న పిల్లలకి తెలియజేసి తద్వారా పిల్లల అభివృద్ధి బలమైన పునాది వేసేలా చూడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్స్ అంగన్వాడి కేంద్రాలలో పౌష్ఠికాహార ప్రదర్శన ఏర్పాటు చెసి తద్వారా “ఆకు కూరలు, కూరగారులు, మిలెట్స్, పండు వాడి ఏ విధంగా వారి ఆరోగ్యమును కాపాడుకోవాలని అంగన్వాడి టిచర్స్ తెలియచేశారు. ఈ కార్యక్రమం ఎం.పి.పి స్కూల్ ప్రధాన ఉపాద్యాయడు దయానంద స్కూల్ టీచర్స్ జ్యోతి, ఆశా కార్యకర్తలు, అంగన్వాడి కార్యకర్తలు కె.మోహన, ఎం.ధరలక్ష్మి, జి.రేఖా ఎ.పుష్ప పి.ప్రసన్నకుమారి లబ్ధిదారులు పాల్గొన్నారు.