- చంద్రగిరి నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం…
తిరుపతి జిల్లా, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మండల నాయకులతో కలిసి నియోజకవర్గంలోని అభివృద్ధి కార్యక్రమాలపై ఆర్డిఓ నిసాంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రచారంలో భాగంగా నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి పలు అంశాలను ఆర్డిఓ తో ఎమ్మెల్యే చర్చించారు. నియోజకవర్గానికి రావలసిన, అవసరమైన నిధుల గురించి చర్చించి అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఎమ్మెల్యే అడిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై సానుకూలంగా స్పందించిన ఆర్డిఓ పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.