అమరావతి న్యూస్: నరసరావుపేట పల్నాడు జిల్లా ఏర్పాటు అయిన తర్వాత తొలిసారిగా ఆగస్టు 15 వేడుకలను స్థానిక నరసరావుపేటలోని మునిసిపల్ స్టేడియంలో వైభవంగా నిర్వహించుటకు చేయవలసిన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్రీ శివ శంకర్ లతోటి ఐఏఎస్ ., మరియు జిల్లా ఎస్పీ శ్రీ రవి శంకర్ రెడ్డి ఐపిఎస్ .
దీనిలో భాగంగా స్టేజి ఏర్పాటు, అతిథుల గ్యాలరీ, పతాకావిష్కరణ స్థలం, పోలీసు కవాతు మైదానం , వివిధ శాఖల శకటాల ప్రదర్శనకు సంబంధించి చేయవలసిన ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ కలెక్టర్ మరియు శ్రీ ఎస్పీ లతో పాటు జిల్లా అదనపు ఎస్పీ శ్రీ బిందు మాధవ్ ఐపిఎస్ , యేఆర్ అదనపు ఎస్పీ రాజు దిశా డిఎస్పీ రవి చంద్ర ఏఆర్ డిఎస్పీ చిన్ని కృష్ణ మండల రెవెన్యూ అధికారి రమణ నాయక్, నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.