contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పోలీసులకు కొట్టే అధికారం ఉందా ?

అరెస్ట్ చేసిన తరువాత పొలీస్ వారికి ప్రజలను కొట్టే అధికారం లేదు. ఒక వేళ మిమ్మల్ని కొడితే పోలీస్ ఆక్ట్ 1861 సెక్షన్ 29 ప్రకారం ఆ పొలిస్ అధికారికి 3 నెలల జైలుశిక్ష లేదా జరిమానా లేదా జరిమానా మరియు శిక్ష వేయవచ్చు.

అరెస్ట్ చేసిన క్షణం నుండి కోర్ట్ లో ప్రవేశ పెట్టె దాకా మీ పూర్తి బాధ్యత, రక్షణ ఒక వేళ మీకు ఏమి జరిగిన పూర్తి బాధ్యత పోలీస్ వారిదే అందుకే అరెస్ట్ చేసే సమయం లోనే మెమో ఆఫ్ అరెస్ట్ ( పేపర్ ) రాపించాలి. Cr. P. C SECTION 41 B, C, D ప్రకారం పేపర్ మీద రాయమని అడగాలి. ఎలా అంటే నేను పలానా పోలీస్ అధికారిని పలానా వ్యక్తిని పలానా నేరం కింద అరెస్ట్ చేస్తున్నాను అని అధికారి పేరు అతని ర్యాంక్ కానిస్టేబుల్, ఏస్ఐ etc.. తేదీ స్థలం ఏ స్టేషన్ కింద అరెస్ట్ జరుగుతుంది, ఆ సమయంలో అరెస్ట్ చేయబడిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితి అతనికి ఎమైన స్వల్ప లేదా తీవ్ర గాయాలు ఉన్నాయా, అతని దగ్గర వుండే వస్తువులు మొత్తం పేపర్ లో రాసి అతని బంధువులు లేదా శ్రేయోభిలాషులు లేదా సమాజంలో మంచి పేరు ఉన్న వ్యక్తి సంతకం, అరెస్ట్ చేసే పోలీస్ అధికారి సంతకం, అరెస్ట్ చేసిన వ్యక్తి యొక్క సంతకం కూడా కచ్చితంగా పేపర్ లో రాయాలి దీన్నే మేమో ఆఫ్ అరెస్ట్ అంటారు. అరెస్ట్ చేసిన 24 గంటల లోపే మెజిస్ట్రేట్ లేదా కోర్ట్ లో కచ్చితంగా ప్రవేశ పెట్టాలి.

ఏ పోలీసు అయినా మిమ్మల్ని స్టేషన్ కి రండి అని ఫోన్ చేస్తే ముందు ఆ అధికారికి ఇలా అడగండి Crpc సెక్షన్ 169, 170, 50 ల ప్రకారం నోటీసులు సర్వ్ చేయవలనని, వినయంగా కోరుచున్నాను అని చెప్పండి లేదా వారు ఫోన్ చేసిన మొబైల్ నంబర్ కు మెసేజ్ చెయ్యండి. వివిధ హైకోర్టులలో అరెస్టు సమయంలో సంబంధిత పోలీసు అధికారుల కోట్టడం జరిగింది. వారి మీద రిట్స్ వేయడం జరిగింది. వివిధ కోర్టులు శిక్ష వేయడం జరిగింది.

పోలీసులు నేరస్తులు అనుమానితులను చిత్రహింసలకు గురి చేస్తే  భారతీయ శిక్షాస్మృతిలోని U/s 330, 331 ప్రకారం నేరం అవుతుంది. ఒక వ్యక్తిని గాయపరచడం ద్వారా గాని అతని దగ్గర నుండి ఎటువంటి సమాచారం అయినా  తెలుసుకునేందుకు సదరు వ్యక్తిని శారీరకంగా గాయపరిస్తే ఆ గాయపరిచిన అధికారికి సుమారు ఏడు సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించవచ్చు అని చట్టం చెబుతోంది. ఇలాంటి చట్టాలు ఉన్నప్పటికీ పోలీసులపై భయంతో చాలామంది ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదు. మీలో అవగాహన కల్పించేందుకే మా ఈ ప్రయత్నం
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :