contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

సీఎం సొంత జిల్లాలో…. రెచ్చిపోతున్న ఇసుక మాఫియా

  • పేట ఇసుక మాఫియాతో…. ఎలాంటి సంబంధం లేదు…ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి
  • కోయిల్ కొండలో ఆగని ఇసుక అక్రమ దందా
  • లింగల్చేడు వాగు నుంచి కోయిల్ కొండ, మహబూబ్ నగర్, నారాయణపేటకు అక్రమ రవాణా
  • రాత్రి నుంచి దర్జాగా ఇసుక కొడుతున్న…. పట్టించుకోని పోలీసులు, రెవిన్యూ, మైనింగ్ అధికారులు
  • 45 నుంచి 60 బెంజ్ లతో దర్జాగా ఇసుక అక్రమ రవాణ
  • సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్

 

సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతున్న పట్టించుకునే నాధుడే కరువయ్యారని *సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం సొంత జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇసుక అక్రమ రవాణా కొనసాగుతున్న పట్టించుకునే వారే లేరని ఆయన విమర్శించారు.  మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండలం లింగల్చేడు వాగు నుండి గత రెండు నెలలుగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ఇసుక మాఫియా అని కట్టడి చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ప్రవీణ్ పేర్కొన్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇసుక రవాణా అరికట్టాలని, ఇసుక మాఫియా అని కట్టడి చేయాలని, ఇసుక అందుబాటులోకి తేవాలని కొత్త పాలసీలు తీసుకొస్తుంటే…. ఆయన సొంత జిల్లాలో మాత్రం ఇసుక అక్రమ రవాణా కొనసాగుతూనే ఉందని ఆయన విమర్శించారు. కోయిలకొండ మండలంలో కోట్లాది రూపాయలు ఇసుక అక్రమ రవాణా కొనసాగుతున్న స్థానిక పోలీసులు, రెవిన్యూ సిబ్బంది, మైనింగ్ శాఖ అధికారులు మాత్రం నిమ్మకునీరెట్లుగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. ఇసుక మాఫియా ఇచ్చే లంచాలకు అలవాటు పడి ఇసుక అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని ఆయన ఆరోపించారు.

 రెండు నెలలుగా…. ఇదే తంతు:

మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండలం లింగల్చేడు వాగులు నుండి గత రెండు నెలలుగా ఇసుక అక్రమ రవాణా కొనసాగుతున్న, స్థానిక పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, మైనింగ్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడం దురదృష్టమని ప్రవీణ్ విమర్శించారు. ఇసుక మాఫియా ఇచ్చే లంచాలకు అలవాటు పడ్డ కొందరు అధికారులు ఏదేచ్ఛగా ఇసుకను అక్రమ రవాణా చేస్తున్న, చూసిచూడనట్టు వివరిస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఫిబ్రవరి మాసంలో 23వ తేదీన 29వ తేదీన రెండుసార్లు దాదాపు 60 నుంచి 70 భారత్ బెంజ్ లతో ఇసుక అక్రమ రవాణా చేశారని, ఈ విషయాన్ని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్, ఎస్పీలకు తాను ఫిర్యాదు చేసినట్లు ప్రవీణ్ తెలిపారు.

అంతేకాకుండా గత నెల మార్చి రెండవ తేదీన, 26వ తేదీన ఇదే ఇసుక మాఫియా దాదాపు 45 నుంచి 60 70 వాహనాలను ఇసుకను అక్రమ రవాణా చేసిందని ఆయన తెలిపారు. తాము ఫిర్యాదు చేసిన నేపథ్యంలోని గత నెల మార్చి 26న మహబూబ్నగర్ డిఎస్పి, రూరల్ సీఐ ఇతర ఎస్ఐ లతోపాటు కోయిలకొండ రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారులు
లింగల్చేడు వాగు నుండి ఇసుకను డంప్ చేసిన ప్రాంతానికి వెళ్లి సీజ్ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే ఆ అధికారులు సీజ్ చేసిన ఇసుకడంపుని ఆదివారం రాత్రి నుండి సోమవారం ఉదయం 8 నుంచి 9 గంటల వరకు దాదాపు 45 నుంచి 60 భారత్ బెంజ్ ల తో లింగల్చేడు వాగు నుండి కోయిలకొండ మహబూబ్నగర్ నారాయణపేటకు ఇసుక మాఫియా ఇసుక నా క్రమంగా తరలించిందని ఆయన తెలిపారు. ఒక్కో భారత్ బెంచ్ కనీసం మూడు నుంచి 6 ట్రిప్పులు ఇసుకను అక్రమంగా తరలించగా దాదాపు కోటి 8 లక్షల నుండి రెండు కోట్ల వరకు విలువైన ఇసుకను ఇసుక మాఫియా అక్రమ రవాణా చేసి కోట్లు దండుకుందని ప్రవీణ్ ఆరోపించారు. ఇందుకు సంబంధించి కొన్ని భారత్ బెంజ్ ల యొక్క ఫోటోలను మీడియా సమావేశంలో ప్రదర్శించారు.

 కలెక్టర్కు ఎస్పీలకు ఫిర్యాదు

కోయిలకొండ మండలం లింగల్చేడ్ నుండి ఇసుక క్రమ రవాణా చేస్తున్న ఇప్పటివరకు ఇసుక మాఫీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్, ఎస్పీలకు సోమవారం ఫిర్యాదు చేసినట్లు ప్రవీణ్ కుమార్ తెలిపారు. వెంటనే స్పందించి ఇసుక మాఫియా పై చర్యలు తీసుకోవాలని ఆయన కోరినట్లు తెలిపారు.

పేట ఇసుక మాఫియాతో…. ఎలాంటి సంబంధం లేదు…ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి

గత రెండు నెలలుగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నారాయణపేట నియోజకవర్గం కోయిలకొండ మండలం లింగల్చేడ్ పెద్దవాగు నుండి ఇసుక అక్రమ రవాణాకు నాకు సంబంధం లేదని….పేట ఇసుక మాఫియా తో తనకి ఎలాంటి సంబంధం లేదని నారాయణపేట ఎమ్మెల్యే పర్నికా రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయమై నేను సైతం ఎమ్మెల్యే వర్ణిక రెడ్డి వ్యక్తిగత కార్యదర్శికి మాధవరెడ్డికి ఫోన్ చేసి వివరణ కోరగా, ఎమ్మెల్యే కుటుంబ కార్యక్రమాల్లో ఉన్నారని, ఎమ్మెల్యే వివరణ తీసుకొని తెలియజేస్తానని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే వివరణ పొరగా తనకు ఇసుక మాఫియా కు లింగంపేట్ అక్రమ రవాణాకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే స్పష్టం చేసినట్లు మాధవరెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే వర్ణిక రెడ్డికి ఇసుక మాఫియా తో సంబంధం లేకుంటే….. ఎవరి అండదండలతోటి ఇసుక మాఫియా గత రెండు నెలలుగా ఇసుక అక్రమ రవాణా చేస్తుందో, విచారణ జరిపించాలని దిడ్డి ప్రవీణ్ కుమార్ ఈ సందర్భంగా
డిమాండ్ చేశారు.

ఇసుక అక్రమ రవాణా ను….అడ్డుకుంటాం

నారాయణపేట జిల్లా కోయిల్ కొండ మండలంలో ఇసుక మాఫియా మళ్లీ, మళ్ళీ రెచ్చిపోతున్న….అడ్డుకోవాల్సిన పోలీస్, మైనింగ్, రెవిన్యూ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టుగా, తాపీగా చోద్యం చూస్తున్నారని, గతంలో ఇసుక మాఫియాకు స్థానిక పోలీసులు, రెవిన్యూ కొమ్ముకాస్తున్నార సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్. ఇసుక మాఫియాపై వాల్టా చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయిస్తామని సామాజిక కార్యకర్త, నేనుసైతం” స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిద్ది ప్రవీణ్ కుమార్ తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :