బెల్లంపల్లి పట్టణంలోని సెంట్ మేరీ స్కూల్ లో విద్యార్థులకు సోమవారం రూరల్ సీఐ రాజ్ కుమార్ అధ్వర్యంలో అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా సీఐ రాజ్ కుమార్ విద్యార్థులతో మాట్లాడుతు సమాజంలో జరుగుతున్న సైబర్ క్రైమ్, ఉమెన్ సేఫ్టీ, ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, గుడ్ టచ్ , బ్యాడ్ టచ్ , అమ్మాయిల వేధింపులు, చదువుపై శ్రద్ధ, సెల్ ఫోన్ వినియోగం వల్ల ఏర్పడే అనార్థాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి అని సూచించారు. ఎక్కడైనా వేధింపులు, ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ చేసినట్లు అయితే వెంటనే షి టీం పోలీసులకు ,తల్లిదండ్రులకు, సమాచారం ఇవ్వాలని తెలిపారు. సెల్ ఫోన్ లోని సోషల్ మీడియా వినియోగం తో అనర్ధాలు కలుగుతాయి కాబట్టి , మొబైల్ వినియోగం తగ్గించుకుని చదువుపై శ్రద్ధ కనబరచాలని సూచించారు. తల్లితండ్రులు విద్యార్థుల చదువుపై దృష్టి సారించాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా చూసుకోాల్సిన బాధ్యత తల్లితండ్రులపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో 2టౌన్ ఎస్ఐ ఆంజనేయులు ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు ,విద్యార్థి విద్యార్థినులు పాల్గొన్నారు.
