ప్రకాశం జిల్లా / ఒంగోలు : ఒంగోలులోని మామిడిపాలెం చెరువు హైవే ఆనుకుని ఉన్న మురికి కాలువలో గుర్తుతెలియని మృతదేహం కొట్టుకొని వచ్చింది. శనివారం సాయంత్రం స్థానికులు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేయగా మృతదేహాన్ని వెలికి తీసి కేసు నమోదు చేసారు. మృత దేహానికి ఒంటినిండా గాయాలు, కాళ్లు చేతులు విరగడం, తలమీద బలంగా దెబ్బలు గమనించి పోలీసులు హత్యాకోణంలో దర్యాప్తు చేస్తున్నారు.