నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం నల్లమలలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.. అమ్రాబాద్ నుంచి హైదరాబాద్ కు ఐదుగురు యువకులు కారులో ప్రయాణిస్తూ అమ్రాబాద్ మార్గమధ్యంలో చెట్టును బలంగా ఢీకొట్టారు… ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడ్డ మరో ఇద్దరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. మృతులు హైదరాబాద్ బొల్లారం కు చెందిన వ్యక్తులుగా గుర్తించారు.