గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ మండలం జానపాడు గ్రామంలో ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంటిలోని వస్తువులు పూర్తిగా దగ్ధమైన మన్నెం వెంకటలక్ష్మి కుటుంబాన్ని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్ పల్నాడు డివిజన్ సభ్యులు పరామర్శించి, అదేవిధంగా ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు . భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు స్పష్టమైంది. వారికి బియ్యం ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ పల్నాడు డివిజన్ ప్రెసిడెంట్ పాశం సైదా రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ షేక్ సుభాని, జనరల్ సెక్రటరీ యతిరాజుల ఏడుకొండలు,సెక్రటరీ ఆవుల ఆదినారాయణ, ట్రెజరర్ ఈశ్వరాచారి, ప్రవీణ్ రెడ్డి పాల్గొన్నారు.