సంగారెడ్డి జిల్లా : నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిది ఆపన్న హస్తంగా నిలుస్తోందని పఠాన్ చేరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో.. నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలు, డివిజన్లకు సంబంధించిన 179 మంది లబ్ధిదారులకు మంజూరైన 63 లక్షల 28 వేల రూపాయల విలువైన చెక్కులను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తుందని తెలిపారు. పూర్తి పారదర్శకతతో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని తెలిపారు. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం కాబోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం కార్పోరేటర్ పుష్ప నగేష్, జిన్నారం మాజీ జెడ్పిటిసి కోలన్ బాల్ రెడ్డి, సీనియర్ నాయకులు ప్రమోద్ గౌడ్, ఐలేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.