contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పగటివేశగాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దు: రసమయి

కరీంనగర్ జిల్లా: ప్రజా సమస్యలను పట్టించుకోకుండా కేవలం ఎన్నికల ముందు గ్రామాలలో తిరిగే పగటి వేశగాళ్ళను నమ్మవద్దని రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మరియు మానకొండూర్ ఎమ్మెల్యే డా. రసమయి బాలకిషన్ ప్రజలకు పిలుపునిచ్చారు, శుక్రవారం గన్నేరువరం మండలం చీమలకుంటపల్లి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ, ఎస్సీ సంఘ భవనానికి భూమిపూజ చేయడంతో పాటు మున్నూరుకాపు సంఘం, కురుమ సంఘం భవనాలను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ జడ్పిటిసి మడుగుల రవీందర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు, గ్రామస్తులు ఎమ్మెల్యే కి ఘనస్వాగతం పలికారు, ఈ సందర్బంగా రసమయి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాక ముందు రైతులు ఉన్న ఊర్లను వదిలి గల్ఫ్ దేశాలకు పోయేవారని, త్రాగడానికి గుక్కెడు నీళ్ల కోసం ప్రజలు కిలోమీటర్ల దూరం వెళ్లి నీళ్లు తెచ్చుకునే దుస్థితి నెలకొందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై కేసీఆర్ సీఎం అయ్యాక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి లక్షల ఎకరాలకు సాగు నీళ్లు,త్రాగు నీళ్లు అందిస్తున్నారని వివరించారు.
వృద్దులకు, వికలాంగులకు, వితంతువులకు ఆసరా పెన్షన్ ఇచ్చి సీఎం కేసీఆర్ పెద్దకొడుకయ్యడయి అండగా నిలిచిన చరిత్ర కేవలం బీ.ఆర్.ఎస్ పార్టీకే దక్కిందన్నారు. రైతుబందు పథకం ద్వారా రైతులకు ఎకరాకు రూ.10వేల సాయం అందించడమే కాకుండా, రైతులు ఏ కారణంతోనైన మరణిస్తే కుటుంబం రోడ్డు పాలు కావొద్దనే లక్ష్యంతో రైతుభీమా పథకం ద్వారా రూ.5లక్షల సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి రుణమాఫీ చేసి తీరామని ఎల్లవేళలా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నా రు. దళితబంధు పథకం ద్వారా దళితులకు రూ.10లక్షల సాయం అందిస్తున్నామని, బీసీ బంధు పథకం ద్వారా కులవృత్తులపై ఆధారపడిన వారికి లక్ష రూపాయల సాయం అందిస్తున్నామని ఆయన తెలిపారు. గృహాలక్ష్మి పథకం ద్వారా ఇంటి స్థలం ఉన్న ప్రతి ఒక్కరికి రూ.3లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.మానకొండూర్ నియోజకవర్గానికి టూరిస్టులుగా వచ్చే కాంగ్రెస్ నాయకులు ప్రజలకు ఎం చేస్తారని, ఏ ముఖం పెట్టుకుని ఊర్లలోకి వస్తున్నారని ప్రజలు నీలదీయాలని ఎమ్మెల్యే రసమయి పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంప వెంకన్న, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు గూడెల్లి తిరుపతి, సర్పంచ్ కర్ర రేఖ కొమురయ్య, ఎంపీటీసీ గూడెల్లి ఆంజనేయులు, మానకొండూరు నియోజవర్గ యువజన సంఘాల అధ్యక్షుడు గూడూరి సురేష్, తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :