contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

అభివృద్ధి చేశాను – ఆశీర్వదించండి

కరీంనగర్ జిల్లా: ది రిపోర్టర్ టీవీ: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో మానకొండూర్ నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశాను, మరోసారి ఆదరించి ఆశీర్వదించండి అంటూ గన్నేరువరం మండల కేంద్రంలో ఓ ఫంక్షన్ హాల్ లో జరిగిన గులాబీ శాంఖరావం కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మరియు మానకొండూర్ ఎమ్మెల్యే డా.రసమయి బాలకిషన్ ప్రజలకు పిలుపునిచ్చారు,ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చిన గులాబీ జెండానే ఎగురుతుందని, మూడవ సారి కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధించబోతుందని, బీ.ఆర్.ఎస్ పార్టీకి కార్యకర్తలు పునాది రాళ్ళని క్షేత్రస్థాయిలో పనిచేయాలని కోరారు, మానకొండూర్ నియోజకవర్గం లో మూడవ సారి గులాబీ జెండానే ఎగురుతుందని, బీఆర్ఎస్ నాయకులందరూ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలన్నారు. ఎన్నికలకు ఎక్కువ సమయం కూడా లేదని ప్రతిపక్షాలకు దీటైన సమాధానం చెప్పాలని ఇచ్చిన మాట ప్రకారం గుండ్లపల్లి నుంచి గన్నేరువరం మీదుగా పొత్తూరు వరకు డబుల్ రోడ్డు తీసుకురావడం జరిగిందని వివరించారు, ఇందిరమ్మ రాజ్యం అంటే సంక్షేమ పథకాలకు కోత పెట్టి ప్రజలను రోడ్డు పాలు చేయడమేనని, ఇప్పుడున్న రూ.2016 పెన్షన్ ను కాంగ్రెస్ వస్తే రూ.200లకు తగ్గిస్తుందని అదేవిధంగా గతంలో మాదిరిగా భూమిషిస్తూ వసూలు చేస్తుందని హెచ్చరించారు, తెలంగాణ రాష్ట్రం వస్తే కరెంటు ఉండదు, నక్సలైట్లు తయారవుతారని, కరెంటు తీగలపై బట్టలు ఎండబెట్టుకునే పరిస్థితి వస్తుందని అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఏద్దేవ చేశారని కానీ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్షలాది ఎకరాలకు సాగు నీరందించడంతో పాటు, వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు, గత సీమాంధ్ర సర్కారు హయాంలో తెలంగాణ ప్రాంతం అన్నీ రంగాల్లో వెనుకబడి పోయిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్నీ రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు.కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్ర రైతాంగం కన్నీళ్ల పాలయ్యారని ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కేసీఆర్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు సాగు నీళ్లు అందించి రైతుల కన్నీళ్లు తుడవడం జరిగిందని పేర్కొన్నారు. దళితబంధు పథకం ద్వారా రూ.10లక్షల సాయం అందించి దళితుల బ్రతుకుల్లో వెలుగులు నింపడం జరుగుతుందని, బీసీ బంధు పథకం ద్వారా కులవృత్తులపై ఆధారపడిన వారికి లక్ష రూపాయల సాయం చేస్తున్నామన్నామని అదేవిధంగా ఇంటిస్థలం ఉన్న ప్రతి ఒక్కరికీ రూ. 3లక్షల సాయం అందిస్తామన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బురద రాజకీయాలు చేస్తున్నరని, వచ్చే ఎన్నికల్లో వారికి గోరి కట్టడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన హెచ్చరించారు,ఎమ్మెల్యే రసమయి కి ఎమ్మెల్యే టికెట్ మూడవ సారి వచ్చిన తర్వాత తొలిసారిగా గన్నేరువరం మండలానికి వచ్చిన శుభ సందర్బంగా ప్రజలు, ప్రజాప్రతినిధులు, బీ.ఆర్.ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనపై పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు..ఈకార్యక్రమంలో జడ్పీటీసీ మడుగుల రవీందర్ రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంప వెంకన్న, సర్పంచుల ఫోరం అధ్యక్షులు తీగల మోహన్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు గూడెల్లి ఆంజనేయులు, రైతుబంధు మండల అధ్యక్షుడు బద్దం తిరుపతిరెడ్డి, మహిళా అధ్యక్షురాలు కుసుంబ నవీన,ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు బూర వెంకటేశ్వర్,నాయకులు న్యాత సుధాకర్,పుల్లెల లక్ష్మణ్, లింగాల మహేందర్ రెడ్డి, గొల్లపల్లి రవి, చింతల రవి, కో ఆప్షన్ సభ్యులు రఫీ, మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ నక్క దామోదర్, మండల యూత్ అధ్యక్షుడు బోయిని కుమార్,మండల యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూన చంద్రశేఖర్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు, ఇన్చార్జులు, నాయకులు, మహిళలు యువకులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :