contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

ఇక్కడ రిపబ్లిక్ డే జనవరి 29న జరుపుకుంటారు .. కారణం ఏమిటో తెలుసా ?

జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవం . మన రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. నాటి నుంచి ప్రతి ఏటా జనవరి 26న దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశమంతటా అదే రోజు రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహిస్తారు. కానీ మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని లో ఉన్న ఓ ప్రముఖ ఆలయంలో మాత్రం.. జనవరి 26న కాకుండా.. మరొక రోజున జరుపుకోనున్నారు. ఈసారి గణతంత్ర దినోత్సవాన్ని అక్కడ జనవరి 26న కాకుండా… జనవరి 29న జరుపుకోనున్నారు. ఇది మొదటిసారి కాదు. గణతంత్ర దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం వివిధ తేదీలలో ఇక్కడ జరుపుకుంటారు. ఆలయ నిర్వాహకులు ఇలా చేయడం వెనుక ఒక ప్రత్యేకమైన కారణం ఉంది.

ఉజ్జయినిలోని పెద్ద గణేష్ ఆలయంలో పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పండగలను మాత్రమే కాదు.. అనేక దశాబ్దాలుగా జాతీయ పండుగలను కూడా ఘనంగా జరుపుకుంటారు. ఐతే వాటిని తేదీల ప్రకారం కాకుండా.. ఇతర పండగల మాదిరే.. తిథుల ప్రకారం జరుపుతారు. పంచాంగం ప్రకారం.. .ఈసారి రిపబ్లిక్ డే తేదీ కూడా జనవరి 29న వస్తుంది. అందుకే పెద్ద గణేష్ ఆలయంలో జనవరి 29న రిపబ్లిక్ డే జరుపుకోనున్నారు. తీజ్, పండుగలు, వార్షికోత్సవాలను ఇంగ్లీషు తేదీ ప్రకారం జరుపుకునే సంప్రదాయం మన ప్రాచీన గ్రంథాల్లో లేదని.. పంచాంగం ప్రకారం మాత్రమే జరుపుకోవాలని ఆలయ సేవకులు చెబుతున్నారు. ఈ ఆలయంలో అనేక ఏళ్లులగా ఇదే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు.

జ్యోతిష్య పండితులు ఆనంద్ శంకర్ వ్యాస్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం 1950, జనవరి 26న అమల్లోకి వచ్చిందని.. ఆ రోజు మాఘమాస శుక్ల పక్ష అష్టమి తిథి అని చెప్పారు. ఈసారి ఆ తిథి జనవరి 29న వస్తున్నందున.. ఆ రోజు ఉజ్జయిని పెద్ద గణేష్ ఆలయంలో గణతంత్ర దినోత్సవాన్ని వైభవంగా జరుపుకుంటారని వెల్లడించారు. రిపబ్లిక్ డే రోజు దేశ శ్రేయస్సును ఆకాంక్షిస్తూ.. వినాయకుడికి పూజలు జరుపుతారని పేర్కొన్నారు. ఏటా గణతంత్ర దినోత్సం రోజున ఆలయ శిఖరంపై కొత్త జెండాను ఎగురవేస్తామని, స్వాతంత్య్ర సమరయోధులను కూడా స్మరించుకుంటామని ఆయన వెల్లడించారు.

 

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :